ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి వేగం పెంచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) 50వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 7 కీలక ప్రతిపాదనలకు మంత్రి వర్గం నుంచి ఆమోదం లభించింది. దీంతో దశాబ్ద కాలంగా కిందా మీదా పడుతున్న Amaravati నిర్మాణానికి కొత్త ఊపొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ, ప్రధాన కార్యదర్శి జెఎస్ జవహర్ రెడ్డి, CRDA కమిషనర్ వివేక్ యాదవ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ .. అమరావతి నిర్మాణాన్ని మూడు సంవత్సరాల్లో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. గతంలో డిజైన్ మాస్టర్ ప్లాన్ 2018లో ఆలస్యంగా ఖరారు కావడం వల్ల రాజధాని పనులు నిలకడగా సాగలేదని తెలిపారు. అయితే ఈసారి అన్ని విధివిధానాలు సరళతరం చేయడం వల్ల ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేదన్నారు. వచ్చే మూడేళ్లలో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. CRDA సమావేశంలో అమరావతి మండలంలోని నాలుగు గ్రామాలు, తుళ్లూరు మండలంలోని మూడు గ్రామాలలో మరో 20,494 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించేందుకు ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. ఈ భూములు అమరావతి రాజధాని అభివృద్ధిలో కీలకంగా మారనున్నాయి. అమరావతిలోని ఫైనాన్స్ సిటీ, స్పోర్ట్స్ సిటీల పరిధిలో ఉన్న 58 ఎకరాల భూముల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్, మిక్స్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం RFPs ఆహ్వానించేందుకు ఆమోదం లభించింది. మండడం, రాయపూడి, పిచుకలపాలెం వంటి ప్రాంతాల్లో ఈ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఇక అమరావతిలో పర్యాటకానికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడేలా, ఐదు స్టార్ హోటల్స్ పక్కనే కన్వెన్షన్ సెంటర్లను నిర్మించేందుకు కూడా CRDA ఆమోదం తెలిపింది. దీంతో నగరంలో మెరుగైన సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడనుంది. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ సంక్షోభం..విశ్వాసం కోల్పోతున్న పెట్టుబడిదారులు..ఎందుకంటే.. నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామాగ్రి అవసరాలను తీర్చేందుకు ప్రకాశం బ్యారేజి పైభాగంలో మట్టిని తవ్వడానికి (సాండ్ డ్రెడ్జింగ్) అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన ముడి సరుకుల సమస్యను పరిష్కరిస్తుంది.ఇక అమరావతిని భారతదేశపు మొట్టమొదటి క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఈ 7 ప్రతిపాదనలు అమలులోకి వస్తే అమరావతి నిర్మాణానికి కొత్త గతి, కొత్త జీవం కలుగనుంది. తాజాగా అమరావతిని 'క్వాంటమ్ గేట్ వే హబ్'గా అభివృద్ధి చేసేందుకు తొలి అడుగు పడింది. క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ కు ఏపీ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో గత నెల జూన్ 30న క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్ జరిగింది. ఈ సమావేశంలో దీనికి సంబంధించిన డిక్లరేషన్‌ను రూపొందించారు. తాజాగా ఈ డిక్లరేషన్ కు ఆమోదం తెలపడం ద్వారా అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధికి ప్రభుత్వం మార్గాన్ని సుగమం చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా, దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ టెస్ట్ బెడ్ అయిన 'క్యూ-చిప్-ఇన్'ను రాబోయే 12 నెలల్లోగా అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన పరిశోధన, ఆవిష్కరణలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa