భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి నేడు భూమికి తిరిగి రానున్నారు. ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా జూన్ 25న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌పై డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఐఎస్ఎస్‌కు చేరుకున్న 41 సంవత్సరాల శుభాంశు భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన రెండో వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. ఈ మిషన్‌లో అతనితో పాటు అమెరికాకు చెందిన నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ-విస్నియేవ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కపు ఉన్నారు. ఈ నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్‌లో 14 రోజుల పాటు 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa