AP: చివరి విడతలో భాగంగా రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఈ నెల 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అక్టోబర్ 31 వరకు కార్డుల్లో మార్పులు, చేర్పులను ఉచితంగా చేసుకోవచ్చని చెప్పారు. కార్డులో పొరపాట్లు ఉంటే గ్రామ/వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వాటిని సరిచేసిన తర్వాత ఉచితంగా కార్డులు అందజేస్తామని గురువారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa