ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరొలా దేశీయ మార్కెట్లోకి కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. మోటోరొలా జీ06 పవర్ పేరిట దీన్ని లాంచ్ చేసింది. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరాతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఎంట్రీ లెవల్ ఫోన్స్ కోసం చూస్తున్న వారికి ఇదో ఆప్షన్ అవుతుంది. దీని ధరను రూ.7,499గా పేర్కొంది. 4జీబీ+64జీబీ సింగిల్ వేరియంట్‌లో అందుబాటు ఉంది. మోటోరొలా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్లలో అక్టోబర్ 11 నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.మోటోరొలా జీ06 పవర్‌లో 6.88 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే ప్రొటెక్షన్‌తో వస్తోంది. 120Hz రిఫ్రెష్‌రేటు, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇచ్చారు. దీంట్లో మీడియాటెక్ హీలియో జీ81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ అమర్చారు. ఫోన్ వెనక భాగంలో 50 ఎంపీ ప్రధాన రేర్ కెమెరా ఇచ్చారు. 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది పెంటోన్ లారెల్ ఓక్, పెంటోన్ టెండ్రిల్, పెంటోన్ టేప్‌స్ట్రీ కలర్స్‌లో లభిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa