ఒక ముస్లిం దేశంగా పేరొందిన తుర్కియేలో తాజాగా సంచలనాత్మకంగా ఒక ప్రాచీన దేవాలయం వెలుగులోకి వచ్చింది. ఆ దేశ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరిగిన తవ్వకాల్లో, సుమారు 2,700 ఏళ్ల క్రితం "మాతృ దేవత"కు అంకితం చేయబడిన ఆలయం గుర్తించబడింది.ఈ దేవాలయం ఆధునిక డెనిజ్లీ నగరం సమీపంలో వెలికితీయబడింది. ఇది 1200 BC నుంచి 650 BC మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఫ్రిజియన్ రాజవంశం నిర్మించినదిగా పురావస్తు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఫ్రిజియన్ నాగరికతలో మాతృ దేవత ప్రాముఖ్యత ఫ్రిజియన్ నాగరికతలో సంతానోత్పత్తి మరియు ప్రకృతికి సంబంధించిన ప్రధాన దేవతను గౌరవించారు. ఆమెను వివిధ పేర్లతో పిలిచేవారు — "మాటెరాన్," "మాటర్," "సైబెలే". ఆపై గ్రీకు, రోమన్ నాగరికతలు కూడా ఈ దేవతను ఆరాధించాయని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.ఈ తవ్వకాలకు పాముక్కలే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బిల్గే యిల్మాజ్ కోలాన్సీ నాయకత్వం వహించారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం:"ఈ ప్రాంగణంలో ఒక పవిత్ర గుహ, ఒక స్మారక చిహ్నం, రెండు నిర్మాణాల మధ్య ఉన్న జంట రాతి విగ్రహాలు వెలుగు చూసాయి. ఇవి కొండ శిఖరాలపై చెక్కబడినట్లు కనిపిస్తున్నాయి."అదే సమయంలో, అక్కడ లిబేషన్ బౌల్స్ (ద్రవ పూజల కోసం ఉపయోగించే రాతి పాత్రలు), డ్రైనేజీ కాలువలు కూడా గుర్తించబడ్డాయని ఆమె తెలిపారు.కొండ ప్రాంతంలో స్థాపితమైన పవిత్ర దేవాలయంఈ ఆలయం ఉన్న ప్రదేశం సుమారు 2,800 నుండి 2,600 సంవత్సరాల పూర్వపు కాలానికి చెందిందిగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. "ఇది 'మాతృ దేవత' ఆరాధనకు సంబంధించి ఉండే అవకాశం ఉంది" అనే అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు.కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ లిన్ రోలర్ మాట్లాడుతూ:"ఈ ప్రదేశం ఫ్రిజియన్ పవిత్ర క్షేత్రాల లక్షణాలను కలిగి ఉంది. జంట విగ్రహాల నిర్మాణశైలి మిడాస్ నగరంలోని దేవాలయ నిర్మాణాన్ని గుర్తుచేస్తోంది. ఆలయం కొండ ప్రాంతంలో ఉండటమూ, ఆ కాలంలో పవిత్ర స్థలాలకు ఇది సాధారణ లక్షణమే."అయితే, ఈ స్థలం నిజంగా పంటల దేవత లేదా సంతానోత్పత్తి ఆరాధనకు సంబంధించి ఉందా అన్నది ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు."ఫ్రిజియన్ దేవత అయిన 'మాటర్'ను ప్రజలు ఎలా పూజించేవారో, ఆమె పట్ల భక్తుల భావోద్వేగం ఏమిటో ఇంకా పూర్తిగా స్పష్టత లేదు" అని వారు తెలిపారు.ఈ ఆలయం పురాతన హిరాపోలిస్ నగరం, నేటి పాముక్కలే సమీపంలో ఉన్న డెనిజ్లీ పరిసర ప్రాంతాల్లో వెలికితీయబడింది. గతంలోనూ ఇక్కడ ఒక ఫ్రిజియన్ ఆలయం ఉన్నట్టు గుర్తించబడినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa