AP: సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటనలో పలు సంస్థల ప్రతినిధులతో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటుకు శోభా గ్రూప్ చైర్మన్ మీనన్ రూ.100 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. లైబ్రరీ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆ సంస్థను కోరారు. అంతేకాక, రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై భారత రాయబార కార్యాలయ ప్రతినిధులతో చర్చలు జరిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa