ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంటినొప్పితో బాధపడుతున్నారా,,,,ఇలా చేయండి సమస్య దూరం

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Oct 26, 2025, 10:21 PM

ప్రస్తుతం అందరికీ దంత సంబంధ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. నిద్ర లేచాక బ్రష్ చేసుకుంటున్నప్పుడు అద్దంలో చూసుకుంటూ ఆల్మోస్ట్ అందరం అనుకుంటాం.. పళ్ళ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాలి అని. పళ్ళు గార పట్టో, చిగురు వాపో, పన్ను పుచ్చి పోవడమో జరిగినా కూడా మనం కాస్త ఈ విషయంలో నిర్లక్ష్యంగానే ఉంటాం అంటే అతిశయోక్తి కాదు. బ్రష్ చేసుకుంటున్నప్పుడు కాస్త బ్లడ్ కారడమో, పుచ్చు పళ్ళలో తినే పదార్ధమేదో ఇరుక్కుని ఒక్క నిమిషం ప్రాణం జివ్వుమనడమో జరిగితే కానే మనం ఈ విషయంలో ముందడుగు వేయం. ఈ సమస్యలు మొదలవుతున్నప్పుడే మనం కొన్ని విషయాల్లో జాగ్రత్త వహిస్తే పళ్ళని కాపాడుకున్న వాళ్ళమవుతాం.


పాచి పేరుకుపోవడం


పళ్ళు మీద పాచిగా ఉండడం అనేది అందరికీ జరిగేదే. బ్రష్ చేసేప్పుడు మనం చేసే పని ఆ పాచిని పోగొట్టడమే. అయితే సరిగ్గా బ్రష్ చేయకపోతే మాత్రం ఆ పాచి పేరుకుపోతుంది. దాన్నే మనం పళ్ళు గార పట్టడం అంటాం. ఈ సరిగ్గా శుభ్రం చేయని పాచిలో ఆహార పదార్ధాల చిన్న చిన్న ముక్కలు ఇరుక్కుపోయి పంటి రంగునే మార్చేస్తాయి. తెల్లగా ఉండవలసిన పళ్ళు కాస్తంత పసుపు రంగులోకి మారతాయి. టీ కాఫీలు ఎక్కువగా తాగే వారిలో, పొగాకు నమిలే వారిలో, స్మోకింగ్ అలవాటు ఉన్న వారిలో ఈ గార ఇంకాస్త ముదురు రంగులో కూడా ఉంటుంది.


పుచ్చు పళ్ళు 


పళ్ళపై గార తొలగించుకోకపోతే అది పుచ్చు పళ్ళకీ, చిగురు వాపుకీ కారణమవుతుంది. అంతే కాదు ఒకోసారి చిగురు నుంది రక్తం కారడం కూడా జరగవచ్చు. ఇప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తే పన్ను తీసేయవలసి రావచ్చు కూడా. ఇలాంటప్పుడు మనం సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చాక పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకోవాలి. అవేంటంటే


ఇంటి చిట్కాలు


డెంటిస్ట్ వరకూ వెళ్ళకుండా ఇంట్లోనే మనమేదైనా చేయవచ్చా అనే ఆలోచన మీకు వచ్చేసింది కదా. ఒక చిన్న పరిష్కారం ఉందండి. అదేమిటంటే అరకప్పు వెచ్చని నీటిలో పావు టీ స్పూను బేకింగ్ సోడాని కరిగించండి. అందులోనే పెప్పర్‌మింట్ లేదా క్లోవ్ ఎస్సెన్షియల్ ఆయిల్ నీ కూడా ఒక చుక్క కలుపుకోవచ్చు. ఈ మిశ్రమం తో బ్రష్ చేసుకుని, ఉమ్మేసి, నోరు కడిగేసుకోండి. ఇలా రోజుకి ఒకసారి చేస్తూ ఉంటే గార అనేది పోయేందుకు మంచి అవకాశం ఉంది.


సమస్య రాకుండా


ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే కొన్ని చిన్న విషాయలని మనం అలవాటు చేసుకోవాలి.


రోజుకి రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి. సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్ తో రెండు నిమిషాలు బ్రష్ చేసుకోవాలి. ప్రతి మీల్ తరవాత బ్రష్ చేసుకోవడం మరీ మంచిది, కనీసం రెండు సార్లు తప్పని సరి.


రోజుకి ఒకసారి ఫ్లాస్ చేసుకోవాలి. దీని వల్ల పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహార పదార్ధాల ముక్కలు బయటకి వచ్చేస్తాయి. బ్రష్ చేయడానికి ముందే ఫ్లాస్ చేస్తే గారని పూర్తిగా నివారించవచ్చు.


బాగా చల్లగా, బాగా వేడిగా ఉండే పదార్ధాలకి దూరంగా ఉండడం. కొంత మంది చల్లని నీళ్ళో, కూల్ డ్రింకో తాగాక నోరంతా ఆ పానీయాన్ని తిప్పుతారు. ఈ పని మాత్రం అస్సలు చేయకూడదు. అలాగే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ని కూడా బాగా తగ్గించాలి.


ఏం తినాలి


ఇవి మనం బయట నుంచి చేసేవి. లోపల నించి పళ్ళ ఆరోగ్యాన్ని కాపాడేవి కూడా మనం ఆహారం లో చేర్చుకోవాలి. వాటిలో ముఖ్యమైనది విటమిన్ సి. విటమిన్ సి పంటికే కాదు, స్కిన్, బోన్స్, లిగమెంట్స్, బ్లడ్ వెస్సెల్స్.. ఇలా చాలా వాటికి హెల్ప్ చేస్తుంది. ఈ విటమిన్ సి లభించే ఆహార పదార్ధాలు కూడా తేలికగా లభించేవే. కమలా పండు, బత్తాయి పండు, ద్రాక్ష పండు, కివీ, మామిడి పండు, బొప్పయి పండు, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ వంటి అన్ని బెర్రీ ఫ్రూట్స్‌లో విటమిన్ సి ఉంటుంది. బ్రకోలి, కాలీఫ్లవర్, క్యాప్సికం, పాలకూర, క్యాబేజీ, ఆకుకూరలు, చిలగడ దుంప, బంగాళా దుంప, టమాటో వంటి కాయగూరల్లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అయితే, విటమిన్ సి పచ్చిగా ఉన్న పండ్లలో నుంచి ఎక్కువగా తీసుకోగలం. పచి కూరగాయల నిండి కూడా ఎక్కువగానే లభిస్తుంది. బాగా ఎక్కువ వేడి మీద ఉడికించడం, ఉడికించిన తరువాత ఎప్పటికో తినడం వల్ల అందవలసినంత విటమిన్ సి మనకి లభించదు.


ఎక్కువవుతుందా


ఈ విటమిన్ ఓవర్ డోస్ అయ్యే చాన్స్ చాలా తక్కువ. ఇది నీటిలో కరిగిపోయే విటమిన్ కాబట్టి మన బాడీలో స్టోర్ అయ్యి ఉండదు. ఆహారం ద్వారా ఓవర్ డోస్ అయ్యే ఛాన్స్ ఆల్మోస్ట్ లేదనే చెప్పవచ్చు. విటమిన్ సీ తక్కువైతే మాత్రం ఈ సమస్యలు వస్తాయి.


ఎనీమియా


చిగుళ్ళ నుండి రక్తం కారడం


ఇన్‌ఫెక్షన్స్‌తో పోరాడే శక్తిని కోల్పోవడం


గాయం త్వరగా మానకపోవడం


జుట్టు డ్రైగా మారడం


డ్రై స్కిన్


కీళ్ళ నొప్పులు


బరువు పెరగడం


కాబట్టి, దంత ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు కొన్ని ఫుడ్స్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa