భారతదేశానికి రష్యా సుఖోయ్-30MKI ఫైటర్ జెట్లలో ఉపయోగించే ‘Kh-69 స్టెల్త్ ఎయిర్-లాంచ్డ్ క్రూయిజ్’ క్షిపణి టెక్నాలజీని బదిలీ చేసేందుకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనతో భారత్ స్వయంగా ఈ క్షిపణులను తయారు చేసుకుని, వైమానిక దళ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. 400 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ క్షిపణి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ.. శత్రు రాడార్లను తప్పించుకోగలదు. బ్రహ్మోస్‌తో పోలిస్తే తేలికైన ఈ క్షిపణులను సుఖోయ్ జెట్లు ఒకేసారి నాలుగు మోసుకెళ్లగలదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa