AP: పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. బుధవారం కుళ్లిన గుడ్లను వండి విద్యార్థులకు వడ్డించే ప్రయత్నం చేశారు. వండే సమయంలో దుర్వాసన రావడంతో సిబ్బంది గమనించి ఆ ఆహారాన్ని పారేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఎంఈవో శ్రీనివాసరావు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa