మెక్సికోలో ఇజ్రాయెల్ రాయబారిని హత్య చేసేందుకు ఇరాన్ పన్నిన ఒక భారీ కుట్రను భగ్నం చేసినట్లు అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్ ఏజెన్సీల సహాయంతో మెక్సికో అధికారులు ఈ కుట్రను అడ్డుకున్నారని వారు తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను మెక్సికో ప్రభుత్వం ఖండించింది. తమ దేశంలో అలాంటి కుట్ర జరిగినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.అమెరికా అధికారుల కథనం ప్రకారం, మెక్సికోలో ఇజ్రాయెల్ రాయబారి అయిన ఐనత్ క్రాంజ్ నీగర్‌ను హత్య చేసేందుకు గత ఏడాది చివర్లో ఇరాన్ ప్రణాళికలు రచించింది. ఈ ఏడాది మధ్యకాలం వరకు ఈ కుట్ర క్రియాశీలంగా ఉందని, సరైన సమయంలో దానిని భగ్నం చేశామని అధికారులు తెలిపారు. నిఘా సమాచారం అత్యంత సున్నితమైనది కావడంతో, ఈ కుట్రను ఎలా కనుగొన్నారు, ఎలా అడ్డుకున్నారనే వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు. ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa