అడ్వంచర్ టూరిజానికి విశాఖ కేరాఫ్ అడ్ర్‌సగా మారుతోంది. సాహసాలు చేసేవారికి అద్భుత గగన విహార అనుభవాన్ని అందించే పారామోటారింగ్, సముద్రం లోపల మరో లోకాన్ని చూపించే స్కూబా డైవింగ్‌లను ఏపీటీడీసీ ప్రారంభించింది. రుషికొండలో ఈ రెండు సాహసోపేత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. విహంగ్ అడ్వంచర్స్ సంస్థతో కలిసి పారామోటారింగ్ ప్రారంభించింది. సాగర్‌నగర్‌లో డైవ్ అడ్డా స్కూబా డైవింగ్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని గురువారం ఏపీటీడీసీ చైౖర్మన్ నూకసాని బాలాజీ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అడ్వంచర్ టూరిజంలో భాగంగా పారామోటారింగ్, స్కూబా డైవింగ్ సెంటర్‌లకు అనుమతులు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో ఏపీటీడీసీ ఈడీ శేషగిరి, జీఎం చందన నాంచారయ్య, డైవ్ అడ్డా ప్రతినిధి శ్రీనివాస్, విహంగ్ అడ్వంచర్స్ ప్రతినిధి సూర్య తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa