ట్రెండింగ్
Epaper    English    தமிழ்

Ind vs SA: కోల్‌కతా టెస్ట్‌లో గిల్ ఫిట్ కాదు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 10:40 PM

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు.సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ స్తంభించగా, గిల్ క్రీజులోకి రాలేకపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. తీవ్రమెడ నొప్పి కారణంగా అతన్ని ఆసుపత్రికి తరలించామని బీసీసీఐ ప్రకటించింది. ఈ టెస్ట్‌లో గిల్ ఆడటం కష్టతరమని తెలుస్తోంది.
*బీసీసీఐ స్పందన:గిల్ గాయంపై బీసీసీఐ తెలిపింది, “గిల్ తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నాడు. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించాం. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడిని పర్యవేక్షిస్తోంది. పరిస్థితిని సమీక్షించిన తర్వాత గిల్ బ్యాటింగ్ చేయగలనా అనే అప్‌డేట్ ఇవ్వబడుతుంది.”
*నిద్రలేమి కారణం:టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ (Morne Morkel) గిల్ గాయంపై మాట్లాడుతూ, “మెడ నొప్పికి అసలు కారణం పని ఒత్తిడి కాదు. సరైన నిద్ర లేకపోవడం కారణమని భావిస్తున్నాం. ఉదయం నిద్రలేచేటప్పటి నుండి మెడ పట్టేస్తోంది, అది రోజంతా కొనసాగింది. గిల్ త్వరలోనే రికవరీ అవుతాడు. బ్యాటింగ్ చేయకపోవడం మన దురదృష్టం” అన్నారు.రెండో రోజు ముగిసే సమయానికి సౌతాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. భారత్‌పై 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో కోర్బిన్ బాష్ (1), టెంబా బావుమా (29) ఉన్నారు. భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన కనబరిచాడు, నాలుగు వికెట్లు తీసి 28 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. ఓవర్‌నైట్ 37/1తో ప్రారంభించిన టీమిండియా 189 పరుగులకు ఆలౌటైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa