రిలయన్స్ గ్రూపు చైర్మెన్ అనిల్ అంబానీకి చెందిన మనీలాండరింగ్ కేసులో ఈడీ తాజాగా రూ.1400 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. గతంలో ఈ కేసుతో సంబంధం ఉన్న సుమారు రూ.7500 కోట్ల ఆస్తులను ఇప్పటికే జప్తు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ ఆస్తులను మనీలాండరింగ్ కేసుతో అనుసంధానించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ తాజా జప్తుతో కేసులో మొత్తం జప్తు చేసిన ఆస్తుల విలువ సుమారు రూ.9000 కోట్లకు చేరుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa