జీవీఎంసీ 5వ వార్డు పరిధిలో సుమారు 12 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గురువారం శంకుస్థాపన చేశారు. 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో సాయిరాం కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, వార్డు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నామని తెలిపారు. భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులు, మంచినీటి పైపులైన్లు, కాలువలు, డ్రైన్ల నిర్మాణం వంటి పనులు ఇందులో భాగంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa