గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించింది. ఈ టోర్నీలో భారత బాక్సర్లు మొత్తం 9 స్వర్ణాలతో సహా 20 పతకాలు సాధించి రికార్డు సృష్టించారు. నిఖత్ జరీన్ 51 కేజీల ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన గువో యి జువాన్‌ను 5-0తో చిత్తు చేసింది. జాస్మిన్ లంబోరియా (57 కేజీ), మీనాక్షి (48 కేజీ), ప్రీతి (54 కేజీ), పర్వీన్ (60 కేజీ), అరుంధతి (70 కేజీ), నుపూర్ (80+ కేజీ) కూడా స్వర్ణాలు నెగ్గారు. పురుషుల విభాగంలో సచిన్ (60 కేజీ), హితేష్ (70 కేజీ) బంగారు పతకాలు సాధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa