పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో శుక్రవారం ఉదయం 10:08 గంటలకు 5.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. రాజధాని ఢాకాకు 50 కిలోమీటర్ల దూరంలో నర్సింగ్‌డిలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ ప్రకంపనల ధాటికి భారత్‌లోని కోల్‌కతా, ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa