మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లా నుంచి బయలుదేరిన యురేసియన్ గ్రిఫాన్ రాబందు ‘మారిచ్’, 15 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని భారతదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చిందని అటవీ శాఖాధికారి తెలిపారు. ఈ పక్షి పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకస్థాన్‌ల గుండా ప్రయాణించి, ప్రస్తుతం రాజస్థాన్‌లోని ధోల్‌పుర్ జిల్లాలో తిరుగుతోంది. ఉపగ్రహ రేడియో కాలర్ సహాయంతో దాని కదలికలను అటవీ శాఖ గమనిస్తోంది. జనవరి 29న గాయపడిన స్థితిలో కనిపించిన ఈ రాబందుకు చికిత్స అందించి, విడుదల చేశారు. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa