అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌కు వైట్‌హౌస్‌లోకి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అత్యాధునిక యుద్ధ విమానాలతో కూడిన భద్రతా ఒప్పందం కుదిరింది. అయితే ట్రంప్ ఇచ్చిన ఈ రెడ్-కార్పెట్ ట్రీట్‌మెంట్, అలాగే జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్యలో ఎంబీఎస్ ఆరోపణలను ట్రంప్ బహిరంగంగా సమర్థించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
అసలేం జరిగిందంటే?
2018లో వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్, సౌదీ విమర్శకుడు ఖషోగ్గీ.. ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో హత్యకు గురైన విషయంఅందరికీ తెలిసిందే. ఈ హత్యతో అమెరికా-సౌదీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ తాజాగా సౌదీ ప్రిన్స్ అమెరికాకు రావడం.. ట్రంపే దగ్గరుండి ఆయనకు స్వాగతం పలకడం, మద్దతు ఇవ్వడం అమెరికన్లను షాక్‌కు గురి చేస్తోంది. ముఖ్యంగా ఈ హత్య తర్వాత ఎంబీఎస్ అమెరికాకు రావడం ఇదే మొదటిసారి కాగా.. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ చరిత్రను పక్కన పెట్టి మరీ సౌదీ ప్రిన్స్‌కు స్వాగతం పలికారు. ముఖ్యంగా F-35 స్టెల్త్ జెట్‌లతో సైనిక ప్రదర్శన, ఉత్సవ ఫిరంగి కాల్పులు, గుర్రాలపై సైనికుల కవాతు, సౌత్ లాన్ విందు వంటి ఆర్భాటాలను కూడా ఏర్పాటు చేశారు.
విందు తర్వాత ఖషోగ్గీ హత్యలో ఎంబీఎస్ పాత్ర, తన కుటుంబ వ్యాపార సంబంధాల గురించి ఒక రిపోర్టర్ ప్రశ్నించగా.. ట్రంప్ కోపంగా స్పందించారు. ఖషోగ్గీని వ్యాపారంలోనే అత్యంత చెడ్డవారిలో ఒకడిగా అభివర్ణించారు. అలాగే మా అతిథిని ఇబ్బంది పెట్టవద్దంటూ రిపోర్టర్‌ను మందలించారు. తన కుటుంబం సౌదీ అరేబియాతో చాలా తక్కువ వ్యాపారం చేసిందని గుర్తు చేశారు. అలాగే ఎంబీఎస్ అద్భుతమైన పని చేశాడని వివరించారు. ఖషోగ్గీ గురించి అతనికి ఏమీ తెలియదని ట్రంప్ MBSను గట్టిగా సమర్థించారు. మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా ఖషోగ్గీ హత్యను బాధాకరమైన ఘటనగా అభివర్ణించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమ దర్యాప్తు ప్రక్రియలను బలోపేతం చేశామని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఘన స్వాగతంపై అమెరికా సెనేటర్ బెర్నీ సాండర్స్ తీవ్రంగా మండిపడ్డారు. ట్రంప్ ముస్లింలు అందరినీ ద్వేషిస్తారని అన్నారు. కానీ ముస్లిం బిలియనీర్ నిరంకుశులను తప్ప అంటూ తన మనసులోని మాటను వెల్లడించారు. ఎందుకంటే ఆ బిలియనీర్లు ట్రంప్ కుటుంబాన్ని మరింత ధనవంతులను చేయగలరని సాండర్స్ ఎక్స్ వేదికగా తెలిపారు. అంతర్జాతీయంగా వెలివేయబడ్డ ఎంబీఎస్‌కువైట్‌హౌస్‌లో గౌరవ అతిథిగా లభించిన ఆతిథ్యంపై సరికాదని సాండర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ గతంలో ముస్లిం-మెజారిటీ దేశాల నుంచి ప్రయాణ నిషేధం విధించడం, ఇస్లాం మనల్ని ద్వేషిస్తుందని వ్యాఖ్యానించడం, మసీదులపై నిఘా ఉంచాలని సూచించడం వంటి ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలను ప్రజలు ఎవరూ మర్చిపోలేరని కూడా సాండర్స్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa