ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ల్యాండ్ రీ సర్వే అభ్యంతరాల గడువు పెంపు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 01:39 PM

AP: రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీసర్వేలో, తహసీల్దార్ స్థాయిలో అభ్యంతరాల పరిష్కార గడువును ఏడాది నుంచి రెండేళ్లకు పెంచాలని రాష్ట్ర అసెంబ్లీ పిటిషన్ల కమిటీ సిఫార్సు చేసింది. విశాఖలో జరిగిన ఈ కమిటీ సమావేశంలో పలు వినతులను స్వీకరించారు. గడువు పెంపు వల్ల రైతులకు మేలు జరుగుతుందని కమిటీ పేర్కొంది. ఇప్పటికే 7 లక్షల అభ్యంతరాలు రాగా, 2 లక్షల సమస్యలు పరిష్కరించామని సర్వే డైరెక్టర్ తెలిపారు. ఈ సిఫార్సుపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa