భారత్-అఫ్గానిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. దౌత్యపరమైన అవగాహనతో పాటు వాణిజ్య రంగంలోనూ రెండు దేశాలు దగ్గరవుతున్నాయి. ముఖ్యంగా తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భారత్ అఫ్గాన్‌కు మానవతా సాయం, అవస్థాపన సహకారం అందిస్తూ ముందుండి నడుస్తోంది. ఈ దగ్గరి సంబంధాలను అసూయతో చూస్తున్న పాకిస్తాన్ ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టిస్తూ వస్తోంది.
ఇటీవల పాకిస్తాన్ మరోసారి తన రోడ్డు మార్గం ద్వారా అఫ్గానిస్తాన్‌కు భారతీయ వస్తువుల రవాణాకు అడ్డుకట్ట వేసింది. వాగ్హా-అటారీ సరిహద్దు ద్వారా వెళ్లే ట్రక్కులను ఆపేసి, అఫ్గాన్ ఎక్స్‌పోర్టులపై కూడా కఠిన ఆంక్షలు విధించింది. దీని ద్వారా ఇస్లామాబాద్ భారత్-అఫ్గాన్ వాణిజ్యాన్ని దెబ్బతీయాలని చూసింది. కానీ పాక్ ఈ ఎత్తుగడ ఎంతమాత్రం ఫలించలేదు.
భారత్ వేగంగా స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసింది. ఇరాన్‌లోని చాబహార్ పోర్టు నుంచి సముద్ర మార్గం ద్వారా అఫ్గానిస్తాన్‌కు సరుకులు చేరేలా ఏర్పాటు చేసింది. అదే సమయంలో కాబుల్-ఢిల్లీ, కాబుల్-అమృత్‌సర్ మధ్య ఎయిర్ కార్గో సర్వీసులను త్వరగా ప్రారంభించింది. ఈ వాయు మార్గం ద్వారా ఆపిల్, బాదం, ఎండు పండ్లు వంటి అఫ్గాన్ ఉత్పత్తులు నేరుగా భారత మార్కెట్‌కు చేరుకుంటున్నాయి.
పాకిస్తాన్ భూమి మార్గాన్ని మూసివేసినా భారత్ జల-వాయు మార్గాలతో దానికి బలమైన చెక్ పెట్టింది. ఫలితంగా రెండు దేశాల మధ్య వాణిజ్యం గతంకంటే మరింత వేగవంతమైంది. పాక్ ఆంక్షలు కేవలం తనకే నష్టం కలిగించి, భారత్-అఫ్గాన్ అనుబంధాన్ని మరింత దృఢపరచడమే జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa