ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజు వివరాలు బయటకు రాగానే సోషల్ మీడియా మొత్తం షాక్‌లో పడిపోయింది. ఈ స్కూల్‌ను రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ స్థాపించారు. దేశంలోనే అత్యంత ఖరీదైన పాఠశాలల్లో ఇది ఒకటిగా పేరొందింది. ఇక్కడి విద్య, సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచ స్థాయిలో ఉంటాయని చెప్పడానికి ఈ భారీ ఫీజే నిదర్శనం.
కిండర్‌గార్టెన్ నుంచి 7వ తరగతి వరకు ఏటా రూ.1.70 లక్షలు, 8 నుంచి 10వ తరగతి వరకు ICSE కోర్సు చదివితే రూ.1.85 లక్షలు కాగా, అదే స్థాయిలో IGCSE బోర్డు ఎంచుకుంటే రూ.5.90 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. 11-12వ తరగతి IBDP ప్రోగ్రామ్ కోసం మాత్రం ఏకంగా రూ.9.65 లక్షలు ఫీజు కట్టాల్సి రావడం సామాన్యులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మొత్తం ఎంతమంది మధ్యతరగతి కుటుంబాల ఏడాది ఆదాయానికి సమానమో లెక్కలు వేసుకుంటూ నెటిజన్లు షాకవుతున్నారు.
అయితే ఈ ఖరీదు చూసి ఎవరూ ఆశ్చర్యపోనవసరం లేదు.. ఎందుకంటే ఇక్కడ చదువుతున్న విద్యార్థుల్లో బాలీవుడ్ స్టార్ కిడ్స్ పేర్లు వింటేనే తెగ సంబరపడిపోవచ్చు. షారుఖ్ ఖాన్ కుమారుడు అబ్రామ్, కరీనా కపూర్ కుమారులు తైమూర్-జెహ్, ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్యతో పాటు సైఫ్ అలీ ఖాన్, వరుణ్ ధావన్, కరణ్ జోహార్ పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు. సెలబ్రిటీ పిల్లలతో క్లాస్మేట్స్ అవ్వాలంటే ఈ రేంజ్ ఫీజు సహజమే అని కొందరు ట్రోల్ చేస్తున్నారు.
ప్రపంచ స్థాయి ఫ్యాకల్టీ, అత్యాధునిక ల్యాబ్స్, స్పోర్ట్స్ అకాడమీలు, ఆర్ట్స్-కల్చర్ సెంటర్లు ఇలా అన్నీ ఒక్క చోట ఉండడంతో ఈ ఫీజు వసూలు చేయడం అక్కడి మేనేజ్మెంట్కు సమర్థంగా కనిపిస్తోంది. కానీ సామాన్యులకు మాత్రం “ఇంత డబ్బు పెట్టి చదివితే ఏం అవుతుంది రా బాబు?” అని ట్రోల్ చేస్తూ మీమ్స్ వైరల్ చేస్తూ జోష్‌లో ఉన్నారు!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa