తిరుమల కొండపై నుంచి తిరుపతికి వస్తున్న ఓ కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో మొదటి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనానికి ముందు వెనుక వాహనాలు లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పిందని స్థానికులు వివరించారు. కారును అధికారులు తిరుపతికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa