ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. కుంజ్‌పురి సమీపంలో ఒక బస్సు 70 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఆ బస్సు గుజరాత్ నుండి కుంజ్‌పురికి తీర్థయాత్ర కోసం యాత్రికులను తీసుకెళ్తోంది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, ఇటీవల పలు బస్సు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa