ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ (MMC) రాష్ట్రాల్లో భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్లను నిలిపివేస్తే, తాము ఆయుధాలు విడిచిపెట్టే తేదీని ప్రకటిస్తామని మావోయిస్టులు ప్రకటించారు. MMC స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరుతో విడుదలైన లేఖలో ఈ విధంగా ప్రకటించారు. కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని, దీనికి ఫిబ్రవరి 15 వరకు గడువు కావాలని 3 రాష్ట్రాల ప్రభుత్వాలను మావోయిస్టులు కోరారు. ప్రతిగా, పీఎల్‌జీఏ వారోత్సవాన్ని నిర్వహించబోమని, తమ కార్యకలాపాలను నిలిపివేస్తామని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa