ట్రెండింగ్
Epaper    English    தமிழ்

98 శాతం పిల్లలు తమవారు కాదని తెలిసి షాకవుతున్న తండ్రులు,,,ఉగాండాలో డీఎన్‌ఏ పరీక్షల సంచలనం

international |  Suryaa Desk  | Published : Mon, Nov 24, 2025, 09:16 PM

భార్యలు గర్భం దాల్చారనే వార్త తెలిస్తే చాలు.. భర్తలు ఎంతో సంతోషంగా ఫీలవుతారు. తమకు పిల్లలు పుట్టబోతున్నారని తెగ మురిసిపోతూ భార్యలను చక్కగా చూసుకుంటారు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత నుంచి వారినే ఎత్తుకుంటూ.. వారే తమ సర్వస్వంగా భావిస్తారు. వారికి మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు నిత్యం కష్టపడుతుంటారు. ఇదంతా అందరికీ తెలిసిందే. కానీ ఇంత కష్టపడి పెంచుతూ, ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న తమ బిడ్డలు.. తమకు పుట్టిన వారు కాదని తెలిస్తే వారి బాధ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఆ చేదు నిజాన్ని అంగీకరించలేక, బిడ్డల్ని దూరం చేసుకోలేక నరకం చూస్తుంటారు. ఇలా ఏ ఒక్కరికో, ఇద్దరికో జరగడం సహజమే. కానీ ఉగాండాలోని 98 శాతం మంది పురుషులు ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కుంటున్నారు. తమకు పుట్టిన పిల్లలు తమ వారు కాదని తెలిసి ఏం చేయాలో పాలుపోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.


ఆఫ్రికా దేశం ఉగాండా ప్రస్తుతం తీవ్రమైన సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా తమ పిల్లలకు తమ పోలికలు కాకుండా వేరే వాళ్లవి రావడంతో.. అనేక మంది పురుషులు తమ పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు చేయిస్తున్నారు. ఇలా చేయించుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండగా.. అందులో 98 శాతం మందికి, ఆ పిల్లలకు తాము తండ్రులం కాదని తెలిసి షాక్‌కు గురవుతున్నారు.


ఈ సమస్య గురించి తెలుసుకున్న ఈ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి షాకింగ్ కామెంట్లు చేశారు. "మీ గుండె దృఢంగా ఉంటే తప్ప, ఈ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రాకండి" అంటూ ఆయన బహిరంగంగా హెచ్చరించారు. ఇటీవలే అక్కడి కోర్టులో విచారించిన ఓ కేసే.. ఈ తీవ్ర సంక్షోభానికి కారణంగా తెలుస్తోంది. కంపాలాలోని ఓ సంపన్న విద్యావేత్త తన ముగ్గురు సంతానంలో ఒకరికి తండ్రి కాదని డీఎన్‌ఏ పరీక్షలో తేలింది. స్థానిక మీడియా ఈ కేసును విస్తృతంగా ప్రచురించడంతో.. ఇది దేశవ్యాప్తంగా పురుషుల్లో తమ సంతానంపై అనుమానాలను రేకెత్తించింది. దీంతో అనేక మందికి, ముఖ్యంగా తమ పోలికలతో లేని పిల్లలపై అనుమానం పెరిగింది. దీంతో డీఎన్ఏ పరీక్షల కోసం డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.


ఫలితంగా ఉగాండా అంతటా కొత్తగా అనేక డీఎన్ఏ పరీక్షా కేంద్రాలు వెలిశాయి. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు సైతం ఈ పరీక్షలు చేయించుకుని.. తమ పిల్లలు తమకు పుట్టిన వారు కాదని తెలుసుకుని కుంగిపోతున్నారు. అసలు తమ భార్యలు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక నరకం చూస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్రికన్ సంప్రదాయాల ప్రకారం.. ఒక మహిళ తన భర్తకు సంతానం ఇవ్వడంలో విఫలమైతే, ఆమె విడాకులు ఇవ్వాలి. లేదా ఇంటి నుంచి బహిష్కరణ వంటి శిక్షను ఎదుర్కోవలసి వస్తుంది. చాలా సందర్భాల్లో పురుషుల్లోనే సంతాన సమస్యలు ఉన్నప్పటికీ.. శిక్ష మాత్రం మహిళకు పడుతుండడంతో కొందరు మహిళలు తమ వైవాహిక జీవితాన్ని కాపాడుకోవడానికి ఇతరుల ద్వారా పిల్లలను కనడానికి మొగ్గు చూపుతున్నారని ఒక అధికారి తెలిపారు.


ఈ విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలను కాపాడేందుకు మత పెద్దలు, తెగ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా డీఎన్ఏ పరీక్షలు చేయించుకోలేని, ఎక్కువగా డబ్బు లేని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు.. "పిల్లలు ఎలా పుట్టినా, వారు ఈ ఇంటి వారే. వారిని తిరస్కరించడం పాపం" అని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కుటుంబ విలువలను కాపాడటానికి చర్చిలు కూడా డీఎన్‌ఏ పరీక్షలపై దృష్టి పెట్టవద్దని సూచిస్తున్నాయి. అయినప్పటికీ.. అనేక మంది పరీక్షలు చేయించుకుంటూ.. చేదు ఫలితాతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa