ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత్ పర్యటన మరోసారి వాయిదా పడింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కోసం ఈ ఏడాది చివర్లో షెడ్యూల్ చేసిన ఈ పర్యటన, న్యూఢిల్లీలోని ఆత్మాహుతి దాడి నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనల కారణంగా రద్దు అయింది. ఈ ఏడాదిలో నెతన్యాహు తన భారత్ పర్యటనను వాయిదా వేయడం ఇది మూడోసారి. భద్రతా పరిస్థితులపై తాజా అంచనాల తర్వాత నెతన్యాహు వచ్చే ఏడాది కొత్త తేదీని ఖరారు చేసుకునే అవకాశం ఉందని ఇజ్రాయెల్ మీడియా నివేదించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa