ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటన మరోసారి వాయిదా పడింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు, తదనంతర భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదిలో ఆయన పర్యటన రద్దు కావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.వాస్తవానికి, ఈ ఏడాది సెప్టెంబర్ 9న నెతన్యాహు భారత్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ, సెప్టెంబర్ 17న ఇజ్రాయెల్ పార్లమెంటులో ఓటింగ్ జరగడంతో ఆ పర్యటన రద్దయింది. అంతకుముందు ఏప్రిల్‌లో కూడా ఆయన పర్యటన ఇదే విధంగా వాయిదా పడింది. ఇప్పుడు ఢిల్లీ పేలుడు కారణంగా మూడోసారి పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa