కేరళలోని పాలక్కాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్కూటతిల్‌ను లైంగిక ఆరోపణల వివాదం వీడటం లేదు. ఇప్పటికే ఇలాంటి ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆయనపై తాజాగా మరిన్ని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయనకు సంబంధించినవిగా చెబుతున్న ఓ వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్, ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.లీకైన ఆడియోలో రాహుల్ ఒక మహిళతో మాట్లాడుతున్నట్లు ఉంది. గర్భం దాల్చిన మొదటి నెలలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆ మహిళ వివరిస్తుండగా, ‘హాస్పిటల్‌కు వెళ్లు’ అంటూ ఆయన కఠినంగా మాట్లాడినట్లు ఆ క్లిప్‌లో ఉంది. అంతేకాకుండా, ‘నిన్ను గర్భవతిని చేయాలి, మన బిడ్డ కావాలి’ అని రాహుల్ సందేశం పంపినట్లుగా ఉన్న వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్ కూడా బయటకు వచ్చింది. అయితే ఈ ఆడియో, చాట్‌ల వాస్తవికత ఇంకా నిర్ధారణ కాలేదు.ఈ కొత్త ఆరోపణలపై రాహుల్ మామ్కూటతిల్ స్పందించారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని, ఈ ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తానని సోమవారం మీడియాకు తెలిపారు. "నా ఫొటో పెట్టి ఆడియోను విడుదల చేశాక, అది నా గొంతు అవునో కాదో నన్ను అడగటంలో అర్థం లేదు. దేశంలోని ఏ చట్టాన్నీ నేను ఉల్లంఘించలేదు. విచారణ సరైన దశకు చేరుకున్నాక నేను చెప్పాల్సింది చెబుతాను" అని ఆయన తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa