AP: మలక్కా జలసంధి ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం రాగల 6 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో 'సెన్యార్' అనే తుఫానుగా బలపడనుందని పేర్కొంది. ఈ తుపాను ప్రభావం ఏపీ, తమిళనాడు, కేరళ తీరాలతో పాటు అండమాన్ దీవులపై తీవ్రంగా ఉండనుందని చెప్పింది. ఏపీ తీరంలో 29, 30 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa