భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఆగస్టులో దేశవ్యాప్తంగా 'ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్'ను ప్రారంభించింది. రూ.3,000 విలువైన ఈ పాస్‌తో ఏడాది పాటు గరిష్టంగా 200 టోల్‌లు లేకపోతే, రూ.3,000 అయ్యే వరకు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ప్రయాణించవచ్చు. ఇది వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. హైవే యాత్ర యాప్, NHAI వెబ్‌సైట్ ద్వారా ఈ పాస్‌ను పొందవచ్చు. ఈ సౌకర్యం FASTag వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా, ప్రయాణాన్ని మరింత పొదుపుగా, సజావుగా మారుస్తుందని కేంద్రం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa