దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 0-2 తేడాతో వైట్‌వాష్‌కు గురైన నేపథ్యంలో, భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఓటమికి కేవలం ఒక వ్యక్తిని నిందించడం సరికాదని, ఆటగాళ్లు కూడా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ....."ఇలాంటి ఫలితాలు వచ్చినప్పుడు ఆటగాళ్లది కూడా బాధ్యతే అని ప్రజలు గుర్తించాలి. కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం సమంజసం కాదు. నా విషయంలోనూ ఇలాగే జరిగింది, ఆ అనుభవంతోనే చెబుతున్నా. ఓటమికి ఆటగాళ్లు బాధ్యత తీసుకోవాలి, తమ వైఫల్యాన్ని అంగీకరించాలి" అని రవిశాస్త్రి పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా జట్టుగా ఆడి భారత్‌ను ఓడించిందని, కానీ మనం జట్టుగా ఆడామా? అని ఆయన ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa