ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును తక్షణమే అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లకుండా కేంద్ర జల సంఘం సహా ఇతర సంస్థలను నియంత్రించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి కార్యదర్శి వి.ఎల్.కాంతారావుకు లేఖ రాశారు.పాత పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకే పేరు మార్చి, డీపీఆర్ కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. వరద నీటిపై ఆధారపడిన ఈ ప్రాజెక్టుపై తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయని గుర్తుచేశారు. ఈ అంశంపై రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి ప్రతిగా తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa