ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్-2026 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. జేఈఈ మెయిన్స్ ఫలితాలు వెలువడిన వెంటనే, అర్హులైన అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 23 నుండి మే 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. విదేశీ, భారత సంతతి విద్యార్థులకు ఏప్రిల్ 6 నుండి మే 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. మే 4 వరకు ఫీజు చెల్లించవచ్చు. మే 11 నుండి 17 వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 17న రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనుండగా, జూన్ 1న ఫలితాలు వెలువడతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa