ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ కార్డుదారులకు శుభవార్త.. సంక్రాంతి కానుకగా రూ. 3,000 నగదు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 04, 2026, 01:51 PM

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి (పొంగల్) పండుగ సందర్భంగా రూ. 3,000 నగదు సహాయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని సుమారు 2.22 కోట్ల రేషన్ కార్డుదారులకు ఈ నగదు నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేయబడుతుంది. గతేడాది కేవలం సరుకులు మాత్రమే అందించగా, ఈసారి నగదు రూపంలో సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేద కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa