భారతదేశంలో ఈ-పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇది ఎలక్ట్రానిక్ పరికరం ఆధారంగా పనిచేస్తుంది, దీని బ్యాక్ కవర్ లోని చిప్‌లో పాస్‌పోర్ట్ దారుడి బయోమెట్రిక్ వివరాలు ఉంటాయి. ఈ-పాస్‌పోర్ట్ ద్వారా విమానాశ్రయాలలో స్కానింగ్, తనిఖీ ప్రక్రియ వేగవంతం అవుతుంది. 36 పేజీల బుక్‌లెట్‌కు రూ.1,500, 60 పేజీల బుక్‌లెట్‌కు రూ.2,000 రుసుము చెల్లించాలి. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు, రెన్యువల్ చేసుకునేవారు కూడా ఈ-పాస్‌పోర్ట్ పొందవచ్చు. ప్రస్తుతం కొన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఈ సేవను త్వరలో మరిన్ని కేంద్రాలకు విస్తరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa