చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి వెల్లుల్లి, వాల్‌నట్స్, పాలకూర వంటి మూడు సూపర్ ఫుడ్స్ ఎంతగానో మేలు చేస్తాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. వాల్‌నట్స్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె లయను క్రమబద్ధీకరిస్తాయి. పాలకూరలోని పొటాషియం, ఫోలేట్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa