కర్ణాటకలో డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో రాసలీలల వీడియోలు పెను దుమారం రేపుతున్నాయి. తన కార్యాలయంలోనే ఓ మహిళతో అభ్యంతరకర రీతిలో ప్రవర్తించినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఆరోపణలను రామచంద్రరావు ఖండించారు. అవన్నీ మార్ఫింగ్ చేసిన వీడియోలని స్పష్టం చేశారు.గతంలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులోనూ రామచంద్రరావుపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అరెస్టయిన నటి రన్యా రావుకు ఈయన సవతి తండ్రి. ఈ కేసు నేపథ్యంలో 2025 మార్చిలో ప్రభుత్వం ఆయన్ను నిర్బంధ సెలవుపై పంపించి, ఇటీవలే తిరిగి విధుల్లోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా పనిచేస్తున్నారు. కాగా, ఈ వీడియోల వ్యవహారంపై న్యాయవాదిని సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటానని రామచంద్రరావు మీడియాకు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa