ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైబీపిని తగ్గించి గుండె సమస్యల్ని దూరం చేసే స్ట్రాబెర్రీస్

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Jan 29, 2026, 11:37 PM

మనం రోజూ తీసుకునే పసుపు, మిరియాలు, ఆకుకూరలు, క్యారెట్స్, నెయ్యి, అరటిపండ్లు, పల్లీలు ఇవన్నీ కూడా మన అనారోగ్య సమస్యల్ని దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడేవే. అందుకోసమే, కచ్చితంగా వీటిని తీసుకోవాలి. అయితే, తీసుకున్నంత మాత్రాన అవి సరైన విధమైన రిజల్ట్ చూపిస్తుందని లేదు. ఎందుకంటే, అవి హెల్దీ ఫుడ్స్ అయినప్పటికీ వాటిని సరైన విధంగా తీసుకుంటేనే మనం అనుకున్న ఫలితాలని అందిస్తుంది. అందుకోసం ఏయే ఫుడ్స్‌ని ఎలా తీసుకోవాలో హెల్త్ కోచ్ మిరుణ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తున్నారు. ఆ వివరాలేంటో మీరూ తెలుసుకోండి.


పసుపుని మిరియాలపొడితో కలిపి


​పసుపు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పాటు మరెన్నో పోషకాలు ఉంటాయి. అందుకే, దీనిని మన వంటల్లోనూ భాగం చేయడమే కాకుండా ఆయుర్వేదంలోనూ వాడుతుంటారు. అయితే, ఈ పసుపులోని గుణాలన్నింటిని అందుకోవాలంటే మాత్రం పసుపుని నల్ల మిరియాల పొడితో కలిపి తీసుకోవాలి.


దీంతో పసుపులోని కర్కుమిన్ అనేది మన శరీరానికి చక్కగా అందుతుంది. ఇది పవర్‌ఫుల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేసి జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పుల వంటివన్నీ దూరమవుతాయి. కాబట్టి, పసుపుని మనం తీసుకున్నప్పుడు అందులో కొద్దిగా మిరియాల పొడిని కలిపి తీసుకోండి. ఇలా తీసుకుంటే దాని పనితీరు 2వేల శాతం పెరుగుతుందట. దీని వల్ల బాడీలోని ఇన్‌ఫ్లమేషన్ తగ్గి నొప్పులు చాలా వరకూ దూరమవుతాయి.


క్యారెట్స్ మంచివే ఎలా వండాలంటే


​క్యారెట్స్ తింటే కళ్ళకి మంచిది. ఇంకా ఎన్నో లాభాలు. అయితే, వీటిని మనం హెల్దీ ఫ్యాట్స్‌తో కలిపి వండి తీసుకున్నప్పుడే ఆ బెనిఫిట్స్ మనకి లభిస్తాయి. అందుకోసం క్యారెట్స్‌ని మనం ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె, నెయ్యి వంటి హెల్దీ ఫ్యాట్స్‌తో కలిపి వండడం మంచిది. దీంతో క్యారెట్స్‌లోని బీటా కెరోటిన్ బాడీకి అందుతుంది. దీంతో కంటి చూపుకి హెల్ప్ అవ్వడమే కాకుండా చర్మం కూడా ఆరోగ్యంగా మారుతుంది.


అరటిపండ్లతో పల్లీలు


అరటిపండ్లు, పల్లీలు రెండూ మంచివే. అయితే, వీటిని విడివిడిగా తీసుకునే బదులు కలిపి తీసుకుంటే మంచిది. వీటి కాంబినేషన్ మంచి ప్రోటీన్ రిచ్‌గా మారుతుంది. ఎవరైతే బరువు పెరగాలనుకుంటారో అలాంటి వారు ఈ రెండింటిని కలిపి తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అంతేకాకుండా, మజిల్స్ కూడా బాగా పెరుగుతాయి.


ఉసిరిని తేనెతో కలిపి తీసుకోవడం


అదే విధంగా, విటమిన్ సి కోసం ఉసిరిని మన డైట్‌లో యాడ్ చేస్తుంటారు. వీటిని నేరుగా అలానే తీసుకోవడం కంటే తేనెతో కలిపి తీసుకోవాలి. దీంతోపాటు, కొద్దిగా మిరియాల పొడి కలిపి చూడండి. అప్పుడు ఇది సూపర్‌ఫుడ్‌గా మారి బ్రెయిన్‌ ఫోకస్ పెరిగేలా చేస్తుంది. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.


స్ట్రాబెర్రీస్‌ని డార్క్‌చాక్లెట్‌తో కలిపి


స్ట్రాబెర్రీస్‌‌ తీసుకోవడం వల్ల మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయి. అయితే, వాటిని నేరుగా తీసుకోవడం కంటే డార్క్‌ చాక్లెట్‌తో కలిపి తీసుకోవడం మంచిది. దీంతో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ అంది బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. దీంతో గుండె పనితీరు మెరుగ్గా మారుతుంది. కాబట్టి, ఎప్పుడైనా సరే డార్క్ చాక్లెట్‌ని స్ట్రాబెర్రీస్‌తో కలిపి తీసుకోండి.


ఆపిల్స్‌పై దాల్చిన చెక్క పొడి తీసుకుంటే


ఆపిల్స్ తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదంటారు. అయితే, అలా ఆపిల్స్‌ని ఊరికే తీసుకోకుండా వాటిపై కొద్దిగా దాల్చినచెక్కపొడి కలిపి తీసుకోండి. దీంతో ఇన్సులిన్ లెవల్స్ మెరుగ్గా మారతాయి. ఎవరైతే షుగర్‌తో బాధపడుతున్నారో వారికి ఈ టిప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. బెస్ట్ కాంబినేషన్‌లా పనిచేసి షుగర్‌ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.


చియాసీడ్స్‌ని తీసుకోవాలనుకుంటే


చియా సీడ్స్‌ని ఈ మధ్యకాలంలో అందరూ తీసుకుంటున్నారు. వీటిని నేరుగా కాకుండా పెరుగుతో కలిపి తీసుకుంటే అవి ప్రోబయోటిక్స్‌లా పనిచేస్తాయి. ఇవి గట్‌హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. జీర్ణ సమస్యల్ని దూరం చేస్తాయి.


చూశారుగా అన్నీ హెల్దీ ఫుడ్స్. కానీ, వాటిని సరైన విధంగా తీసుకుంటేనే అవి మంచి రిజల్ట్స్‌ని అందిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa