అండర్-19 ప్రపంచకప్‌లో భారత యువ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. సూపర్ సిక్స్ దశలో భాగంగా ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్ ఈ గెలుపుతో, తమ గ్రూప్‌లో టాపర్‌గా నిలిచి సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యంగ్ ఇండియా, పాక్‌ను టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది.క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 47 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట సమయంలో వేదాంత్ త్రివేది (98 బంతుల్లో 68) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అతనికి తోడుగా లోయర్ ఆర్డర్‌లో ఆర్ఎస్ అంబ్రిష్ (29), కనిష్క్ చౌహాన్ (35), ఖిలాన్ పటేల్ (21) విలువైన పరుగులు చేయడంతో భారత్ కోలుకుంది. పాక్ బౌలర్లు ఆరంభంలో ప్రభావం చూపినా, చివరి 4 ఓవర్లలో భారత బ్యాటర్లు 39 పరుగులు రాబట్టారు. దీంతో 49.5 ఓవర్లలో 252 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది.253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు గెలుపుతో పాటు నెట్ రన్‌రేట్ మెరుగుపరుచుకోవాలంటే 33.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితి. ఉస్మాన్ ఖాన్ (66), హమ్జా జహూర్ (42) రాణించడంతో ఒక దశలో పాక్ విజయం దిశగా సాగింది. 30వ ఓవర్ ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 151 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే, అక్కడి నుంచి భారత బౌలర్లు చెలరేగడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. కేవలం 43 పరుగుల వ్యవధిలో చివరి 8 వికెట్లను కోల్పోయింది.క్రమంగా నెమ్మదించిన పిచ్‌పై భారత స్పిన్నర్లు పట్టు బిగించారు. కెప్టెన్ ఆయుష్ మాత్రే 21 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ఖిలాన్ పటేల్ కూడా 3 వికెట్లతో రాణించాడు. వీరి ధాటికి పాకిస్థాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో భారత్ గ్రూప్ టాపర్‌గా నిలిచి, బలమైన ఆస్ట్రేలియాతో సెమీస్ పోరును తప్పించుకుంది. ఫిబ్రవరి 4న హరారే వేదికగా జరగనున్న సెమీ ఫైనల్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa