ఏపీలో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు శాంతిభద్రతల పరిరక్షణకు స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీలతో సంబంధం లేకుండా నిందితులపై కేసులు నమోదు చేయాలని ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి వద్ద జరిగిన దాడి ఘటనపై ఆరా తీసిన సీఎం, చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మైలవరం నియోజకవర్గానికి చెందిన టీడీరాజకీయ పార్టీలు ఎల్లప్పుడూ రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య విలువలకు లోబడి వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నాయుడు హితవు పలికారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలకు దారితీసే ఎలాంటి చర్యలనైనా సహించే ప్రసక్తే లేదన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడబోమని తేల్చి చెప్పారు. చట్టం ఎవరికైనా ఒక్కటేనని, తప్పు చేసిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. ప్రజల భద్రత, రాష్ట్ర ప్రశాంతతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని కుండ బద్ధలుగొట్టారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా హెచ్చరించారు.పీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa