టిబెటన్ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా అరుదైన ఘనత సాధించారు. సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డును తొలిసారి గెలుచుకున్నారు. లాస్ ఏంజిల్స్‌లోని క్రిప్టో.కామ్ ఎరీనాలో ఫిబ్రవరి 1న జరిగిన 68వ వార్షిక గ్రామీ అవార్డుల వేడుకలో ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఆయన రూపొందించిన 'మెడిటేషన్స్: ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ దలైలామా' అనే స్పోకెన్-వర్డ్ ఆల్బమ్‌కు గాను 'బెస్ట్ ఆడియో బుక్, నరేషన్ & స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్' విభాగంలో ఈ అవార్డు లభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa