లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే పుస్తకంలోని చైనా అంశంపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీనిపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రచురణ కాని పుస్తకం నుంచి వ్యాఖ్యలు చేయడం హౌస్ రూల్స్‌ను ఉల్లంఘించడమేనని ఆరోపించారు. రాహుల్ గాంధీ వాదనను అధికార పక్షం వ్యతిరేకించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, మ్యాగజైన్ లేదా వార్తాపత్రికల ఆర్టికల్స్‌ను సభ్యులు ప్రస్తావించరాదని అన్నారు. అయితే, ఇండో-చైనా సంబంధాలపై మాట్లాడే హక్కు తనకు ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ గందరగోళం నేపథ్యంలో లోక్‌సభను 3 గంటల వరకు వాయిదా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa