తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలతో పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులు, శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించారు. తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణతో పాటు, కూటమి ప్రభుత్వ ఆగడాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.అలాగే తిరుమల ప్రతిష్టను దిగజార్చే విధంగా జరుగుతున్న చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ నేతలు… ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని, ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ఆగడాలను నిలువరించాల్సిన అవసరం ఉందని నేతలు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ప్రజల్లోకి బలంగా వెళ్లి వాస్తవాలను వివరించడంతో పాటు పార్టీ నేతలకు భద్రత కల్పించేలా పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. కాగా, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్.. ఆ తర్వాత.. అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడులు.. వారిపై కేసులు.. ఇలా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ కొనసాగుతోన్న విషయం విదితమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa