ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వృద్ధురాలిపై అత్యాచారం, ఆపై మనస్తాపంతో ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Mon, Feb 02, 2026, 03:20 PM

బెంగళూరులోని కేఏఎస్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. పదేళ్లుగా నమ్మకంగా మెలిగిన పనిమనిషి.. ఇంట్లో నిద్రిస్తున్న 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. ఈ ఆకృత్యాన్ని తట్టుకోలేక ఆమె చనిపోవడంతో పనిమనిషి అదే గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేరాత్రి దుబాయ్ నుంచి ఇంటి యజమాని తిరిగి రావడంతో ఈ దారుణం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మంగళూరుకు చెందిన బాధిత కుటుంబం కేఏఎస్ కాలనీలో స్థిరపడింది. ఇంటి యజమాని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తుండగా.. ఆ దంపతుల కుమార్తె (26) ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఈ కుటుంబంలో తమిళనాడుకు చెందిన దేవరాజు (45) పదేళ్లుగా పనిచేస్తున్నాడు. తొలుత సమీపంలోని ఓ హాస్టల్ లో ఉంటూ వీరి ఇంట్లో పనిచేస్తుండేవాడు. అయితే, దేవరాజు ప్రవర్తనపై నమ్మకంతో ఆ కుటుంబ సభ్యులు తమ ఇంట్లోనే ఉండిపొమ్మని చెప్పారు. దేవరాజు రోజూ ఇంట్లో పనులు చక్కబెట్టి రాత్రిపూట హాల్ లో పడుకునే వాడు.ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి ప్రాంతంలో దుబాయ్ నుంచి ఇంటి యజమాని తిరిగివచ్చాడు. కాలింగ్ బెల్ కొట్టినా తలుపు తెరవకపోవడంతో కూతురుకు ఫోన్ చేయగా.. ఫస్ట్ ఫ్లోర్ లో పడుకున్న ఆ యువతి వచ్చి తలుపు తీసింది. లోపలకు వెళ్లిన యజమానికి దేవరాజు కనిపించలేదు. అక్కడి నుంచి బెడ్ రూంలోకి వెళ్లగా.. బెడ్ పై అచేతనంగా పడి ఉన్న భార్యను, అదే గదిలో ఉరితాడుకు వేళాడుతున్న దేవరాజును చూసి గట్టిగా అరిచాడు.ఆయన కుమార్తె ఈ దారుణాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించింది. రెండు మృతదేహాలను ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు. అత్యాచారం కారణంగా వృద్ధురాలు మరణించిందని.. అదిచూసి భయాందోళనకు గురైన దేవరాజు ఉరి వేసుకుని ఉంటాడని పోలీసులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa