డేటా షేరింగ్ పేరుతో పౌరుల వ్యక్తిగత గోప్యత (Privacy) విషయంలో ఎలాంటి రాజీకి తావు లేదని సుప్రీంకోర్టు, వాట్సాప్‌తో పాటు దాని మాతృ సంస్థ మెటాకు స్పష్టం చేసింది. ఈ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.విచారణ సమయంలో, ఈ కేసులో కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను (MeitY) కూడా ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 9న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు కోర్టు తెలిపింది.
-కోర్టు చేసిన ప్రధాన వ్యాఖ్యలు: సంక్లిష్ట నిబంధనలు: టెక్నాలజీ సంస్థలు రూపొందించే ప్రైవసీ నిబంధనలు అత్యంత క్లిష్టంగా, తెలివిగా రూపొందించబడుతున్నాయని, సాధారణ వినియోగదారులకు అవి పూర్తిగా అర్థం కావడం కష్టమని కోర్టు వ్యాఖ్యానించింది.
-ఆప్ట్-అవుట్ సదుపాయం?: తమ వ్యక్తిగత డేటాను పంచుకోకుండా ఉండేందుకు వినియోగదారులకు ఉన్న ఆప్ట్-అవుట్ (Opt-out) ఎంపిక ఎక్కడ ఉందని న్యాయస్థానం ప్రశ్నించింది.అసమాన ఒప్పందాలు: వినియోగదారులపై ఒత్తిడి తెచ్చి డేటా షేరింగ్‌కు బలవంతం చేసే లేదా ఒక పక్షానికే లాభం చేకూర్చే అసమాన ఒప్పందాలను తాము అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa