ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింగపూర్‌కు వెళ్లేవారికి అలర్ట్

international |  Suryaa Desk  | Published : Thu, Feb 05, 2026, 02:35 PM

సింగపూర్ ప్రభుత్వం 2026 జనవరి 30 నుంచి కొత్త 'నో బోర్డింగ్' నిబంధనను అమలు చేస్తుంది. దీని ప్రకారం, సింగపూర్‌కు వెళ్లే ప్రయాణికులను విమానం ఎక్కే ముందే, అంటే బయలుదేరే విమానాశ్రయంలోనే ఇమ్మిగ్రేషన్ తనిఖీలు చేస్తారు. అర్హత లేనివారిని విమానం ఎక్కనివ్వరు. వీసా, పాస్‌పోర్ట్ చెల్లుబాటు, SG అరైవల్ కార్డ్ వంటి అంశాలపై తనిఖీలు జరుగుతాయి. గతంలో సింగపూర్ చేరుకున్నాకే ఈ తనిఖీలు జరిగేవి. ఈ నిబంధనలను పాటించని విమానయాన సంస్థలపై సింగపూర్ ప్రభుత్వం జరిమానా విధించనుంది.ప్రయాణికులను సింగపూర్ చేరుకున్న తర్వాత ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద ఆపేవారు. ఇప్పుడు ఆ ప్రక్రియను విమానం ఎక్కడానికి ముందే పూర్తి చేస్తున్నారు. అర్హులైన ప్రయాణికులకే సింగపూర్‌కు వెళ్లే అవకాశం ఇస్తున్నారు. ఈ నిబంధనలను పాటించని విమానయాన సంస్థలపై సింగపూర్ ప్రభుత్వం $10,000 వరకు జరిమానా విధించవచ్చు. అవసరమైతే విమాన సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa