ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో అనంతపురం నగరానికి 10సిటీ సర్వీస్ బస్సులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 05, 2026, 03:14 PM

అనంతపురం నగరానికి త్వరలో 10 సిటీ సర్వీస్ బస్సులు రానున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రూ. 2 కోట్లతో ఆర్ఎం కార్యాలయానికి భూమిపూజ జరిగింది. ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ పూల నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆర్ఎం కార్యాలయ నిర్మాణం ఇప్పుడు జరుగుతోందని, వైసీపీ ప్రభుత్వంలో దీనిని పట్టించుకోలేదని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. పూల నాగరాజు ఛైర్మన్ అయ్యాక ఆర్టీసీ రీజనల్ కు రూ. 20 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa