టిఫిన్ తిన్న గంటకే మళ్ళీ ఆకలి వేయడానికి ప్రధాన కారణాలు ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండటం. ప్రోటీన్, మంచి కొవ్వులు, పీచు పదార్థం తక్కువగా ఉండటం. నిద్రలేమి, ఒత్తిడి కూడా ఆకలి హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. డైటీషియన్ల ప్రకారం అల్పాహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పప్పు గింజలు, గుడ్లు, పెరుగు, బాదం వంటివి చేర్చుకుంటే కడుపు నిండుగా ఉండి, రోజంతా ఉత్సాహంగా ఉంటారు.మనం తినే బ్రెడ్, పంచదార కలిపిన పదార్థాలు లేదా పాలిష్ చేసిన బియ్యంతో చేసిన టిఫిన్లు రక్తంలోని షుగర్ లెవల్స్‌ను ఒక్కసారిగా పెంచి, అంతే వేగంగా తగ్గించేస్తాయి. అయితే షుగర్ లెవల్స్ పడిపోగానే, మన మెదడు మళ్ళీ ఆకలి వేస్తున్నట్లు సంకేతాలు పంపిస్తుంది. దీనివల్ల తిన్న కొద్దిసేపటికే మళ్ళీ నీరసంగా, ఆకలిగా అనిపిస్తుంది.తిన్న ఆహారం మెల్లిగా అరగాలంటే అందులో ప్రోటీన్, మంచి కొవ్వులు ఉండాలి. ఇందుకు కేవలం దోశ లేదా ఇడ్లీ మాత్రమే కాకుండా.. వాటితో పాటు గుడ్లు, పప్పులు, పెరుగు లేదా బాదం, వాల్‌నట్స్ వంటివి చేర్చుకుంటే కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెల్లిగా చేసి కలిని కంట్రోల్ చేస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa