ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాలెంటైన్స్ వీక్ 2026.. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ప్రేమ వేడుకలు

Life style |  Suryaa Desk  | Published : Thu, Feb 05, 2026, 03:11 PM

ప్రేమికుల కోసం ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు వాలెంటైన్స్ వీక్ 2026 ప్రారంభం కానుంది. ఈ వారం ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఫిబ్రవరి 7 రోజ్ డే..మొదటి రోజున రోజ్‌ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. వాలంటైన్స్ వీక్ లో ఎరుపు రంగు రోజ్‌తో తమ ఇష్టమైన  వారికి అందిస్తారు. రెడ్ రోజ్ మాత్రమే కాదు.. వారికి ఇష్టమైన రంగులో ఉన్న రోజ్‌ ఫ్లవర్ ని ఇచ్చి ఆశ్చర్యపరచవచ్చు.


ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే..
ఈరోజు ప్రభాస్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ రోజు తమ ప్రేమికులకు ప్రపోజ్ చేస్తారు చాలామంది ఈ రోజును ఇష్టమైన లవర్స్ కి ప్రపోజ్ చేయాలని అనుకుంటారు అప్పుడు రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది అని నమ్ముతారు


ఫిబ్రవరి 9 చాక్లెట్ డే..


ఈరోజు చాక్లెట్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. అంతేకాదు ఇష్టమైన వారికి తీపి పదార్థాలను ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది.చాక్లెట్స్ కూడా పెద్ద మొత్తంలో ఇస్తారు. దీంతో తమ ప్రేమికుల మధ్య బంధం మరింత చేరువవుతుందని నమ్ముతారు.


 


ఫిబ్రవరి 10 టెడ్డీ డే..


ఫిబ్రవరి 10వ తేదీ టెడ్డీ డేగా నిర్వహించుకుంటారు. తమ ప్రేమికులకు టెడ్డీని గిఫ్ట్ ఇచ్చే ఆనవాయితీ ఉంది. ఇది వారి మధ్య ఉన్న సాన్నిహిత్యానికి సూచిస్తుంది. ప్రధానంగా యువత ఎక్కువగా ఈ టెడ్డీ గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకుంటారు.


 


ఫిబ్రవరి 11 ప్రామిస్ డే..


ఫిబ్రవరి 11 ప్రామిస్ డే గా జరుపుకుంటారు. వాలంటైన్స్ లో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వారి కపుల్స్ మధ్య ఉన్న బంధానికి ఇది మరింత బలోపేతం చేస్తుంది. ఈరోజు చేసుకునే వాగ్దానం ఒకరిపై ఒకరికి ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తుంది.


ఫిబ్రవరి 12 హగ్ డే..


హగ్ డే అంటే ఒకరినొకరు లవర్స్ ఆలింగనం చేసుకునే రోజు. వారి ప్రేమను వ్యక్త పరచడానికి దీని కంటే పెద్ద సింబల్ లేదు. ఇది వారి మధ్య ఎమోషనల్ సపోర్ట్ కూడా పెంచుతుంది.


ఫిబ్రవరి 13 కిస్ డే..


ఇది ప్రేమికుల రోజుకు ముందుగా వస్తుంది. తమ ప్రియమైన వారికి కిస్ పెట్టి ప్రేమను వ్యక్తం చేస్తారు .ఇది వారి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేయడమే కాదు. వారిపై ఉన్న ప్రేమను కూడా వ్యక్త పరుస్తుంది.


ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే..


ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే గా జరుపుకుంటారు. ఈరోజు గిఫ్ట్స్ కొన్ని వారికి ఇష్టమైన వస్తువులు లేదా డేట్ కి వెళ్లడం చేతితో రాసిన నోట్ వంటివి ఇచ్చి పుచ్చుకుంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకుంటారు. ప్రేమలకు ప్రేమికులకు ఇది ఎంతో ముఖ్యమైన రోజు. వాలంటైన్స్ డే ఒకరిపై ఒకరి ప్రేమను మరింత పెంచుకోవడానికి మరింత బలోపేతం చేయడానికి రిలేషన్ షిప్ లో వారికి ఇష్టమైన మెమోరీస్ కోసం జరుపుకుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa