ట్రెండింగ్
Epaper    English    தமிழ்

WPL ఫైనల్‌.. టాస్‌ గెలిచిన ఆర్సీబీ

sports |  Suryaa Desk  | Published : Thu, Feb 05, 2026, 07:11 PM

డబ్ల్యూపీఎల్‌-4లో భాగంగా ఆర్సీబీ, దిల్లీ మధ్య కాసేపట్లో ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.మహిళల క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మహిళల ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్ పోరుకు సమయం ఆసన్నమైంది. వడోదరలోని బీసీఏ స్టేడియం సాక్షిగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, రెండు జట్ల గౌరవానికి సంబంధించిన విషయం. వడోదరలోని బీసీఏ స్టేడియం, కోటంబి వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్‌సీబీ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది టాస్‌ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. 


తుది జట్లు:
బెంగళూరు జట్టు:గ్రేస్ హారిస్, స్మృతి మంధాన (కెప్టెన్), జార్జియా వోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాధా యాదవ్, నాడిన్ డి క్లర్క్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, సయాలీ సత్ఘరే, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్


ఢిల్లీ:లిజెల్ లీ (వికెట్ కీపర్), షఫాలీ వర్మ, లారా వోల్వార్డ్ట్, జెమిమా రోడ్రిగ్స్ (కెప్టెన్), మారిజాన్ కాప్, చినెల్లే హెన్రీ, నికి ప్రసాద్, స్నేహ రానా, మిన్ను మణి, శ్రీ చరణి, నందనీ శర్మ






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa